‘హలో’ ట్రైలర్ టాక్ : అడ్వెంచర్లతో హీట్ పెంచిన అఖిల్ !

Friday, December 1st, 2017, 06:36:58 PM IST

అఖిల్ నటిస్తున్న రెండవ చిత్రం హలోపై క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ని కూడా విడుదల చేయడం విశేషం. కచ్చితంగా చిత్రంపై అంచనాలు పెరిగే విధంగా ట్రైలర్ ఉందని చెప్పుకోవచ్చు. చూస్తుంటే అడ్వెంచర్ లతో సాగే ప్రేమకథలా అనిపిస్తోంది. అఖిల్ చేసిన అదిరిపోయే స్టంట్ లని ట్రైలర్ లో చూపించారు. చిన్ననాటి స్నేహితురాలి కోసం 15 ఏళ్లుగా ఎదురుచూసే యువకుడిగా అఖిల్ కనిపిస్తున్నాడు.

బ్యాక్ గ్రౌండ్ లో నాగార్జున వాయిస్ వినిపిస్తూ చిత్ర కథ గురించి హింట్స్ ఇస్తున్నాడు. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్, అఖిల్ మధ్య సాగె ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. మధ్యలో విలన్ గా కనిపిస్తున్న అజయ్.. ‘ఇదంతా చేస్తున్నది ఫోన్ కోసమా’ అంటూ సస్పెన్స్ లోని నెట్టేశాడు.ఓవరాల్గా ట్రైలర్ లో అఖిల్ సోలో ఫెర్ఫామెన్స్ కొనసాగింది. వెండి తెరపై ఈ అక్కినేని అబ్బాయి మెరుపులు ఎలా ఉంటాయో చూడాలంటె డిసెంబర్ 22 వరకు ఆగాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments