13 ప్రాయంలో డ్రీమ్‌గాళ్ క‌ష్టాలు తెలిస్తే షాకే!

Tuesday, October 17th, 2017, 11:36:29 AM IST

సెల‌బ్రిటీ జీవితం పైకి క‌నిపించినంత సింపుల్‌గా ఉండ‌దు. ఇదో ఒడిదుడుకుల ప్ర‌పంచం. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చి, ఎదురొడ్డి పోరాడాలి. ఆరంభం ఎన్నో అవ‌మానాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆన్ లొకేష‌న్ అయితే ఎన్నో చీద‌రింపులు ఉంటాయి. అవ‌న్నీ తెలిస్తే వామ్మో అంత క‌ష్ట‌మా? అంటూ ముక్కున వేలేసుకుంటారు. ఇదిగో నాటి మేటి టాప్ హీరోయిన్ డ్రీమ్‌గాళ్ హేమ‌మాలిని పాత జ్ఞాప‌కాల్లోకి వెళ్లి చెప్పిన ఓ ఘ‌ట‌న మ‌న‌సు ద్ర‌వింప‌జేసేదే.

హేమ‌మాలిని 13-14 వ‌య‌సులోనే ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించారు. అయితే న‌టించిన తొలి చిత్రంలోనే త‌న‌కు ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. త‌న‌పై కొన్ని సన్నివేశాల్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు .. త‌న‌కి చెప్ప‌కుండానే సినిమా నుంచి తొల‌గించి వేరొక‌రిని ఎంపిక చేసుకున్నారు. దాంతో షాక్‌కి గురై డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయిందిట‌. సినిమా నుంచి తీసేశారు. ఇక నా డ్యాన్సింగ్ షోల‌కు విలువ ఏం ఉంటుంది. జ‌నం ఏం చూస్తారు? అంటూ విచారంలోకి వెళ్లిపోయిందిట‌. అయితే ఆ క్ర‌మంలోనే త‌న త‌ల్లి ధైర్యం నూరి పోశారు. క‌ష్ట‌కాలంలో ఛాలెంజింగ్‌గా ఎద‌గాల‌ని స‌ల‌హా ఇచ్చారు హేమ‌మాలిని త‌ల్లి. అలా ధైర్యం తెచ్చుకుని కెరీర్‌లో ఎదురీదారు హేమామాలి. అస‌లు త‌న‌కి తొలి అవ‌కాశం ఇచ్చింది ఎవ‌రు? అంటే సి.వి.శ్రీ‌ధ‌ర్‌. `వెన్నిర అడై` అనే చిత్రంలో జ‌య‌ల‌లిత ప‌క్క‌నే న‌టిగా అవ‌కాశం ఇచ్చారు. కొన్ని రోజుల షూటింగ్ అనంత‌రం తొల‌గించారు. ద్వితీయ ప్ర‌య‌త్నం రాజ్‌క‌పూర్ `స‌ప్నోం కా సౌధాగ‌ర్‌` అనే చిత్రంలో అవ‌కాశం వ‌చ్చింది. ఆ చిత్రంతోనే డ్రీమ్‌గాళ్‌గా అంద‌రికీ ప‌రిచ‌యమయ్యారు హేమాజీ. డ్రీమ్‌గాళ్ స్టోరి వింటే స్ఫూర్తి క‌లిగిస్తోంది క‌దూ?

  •  
  •  
  •  
  •  

Comments