బ్రేకింగ్ న్యూస్ : జగన్ కేబినేట్ లో 25 మంది మంత్రుల జాబితా ఇదే

Friday, June 7th, 2019, 06:16:03 PM IST

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీలోని మొత్తం ఎమ్మెల్యేలతో కలిసి ఒక సమావేశాన్ని ఈ రోజు నిర్వహించిన సంగతి తెలిసిందే.అదే విధంగా జగన్ కూడా తన క్యాబినెట్ లోని మొత్తం ఐదుగురు డిప్యూటీ సీఎం లు ఉన్నారని చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.అదే విధంగా జగన్ తన క్యాబినెట్ లోని ఉండబోయే మొత్తం 25 మంది మంత్రుల జాబితాను కూడా విడుదల చేస్తారని తెలిపారు.

కానీ జగన్ మాత్రం ఆ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో రాజకీయ మరియు వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ మరింత ఎక్కువయ్యింది.అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం జగన్ క్యాబినెట్ లో ఉండబోయే మొత్తం 25 మంది పేర్లు బయటకు వచ్చేసాయి.అధికారికంగా కూడా విడుదల చెయ్యబోయే ప్రకటనలో కూడా వీరి పేర్లే ఉంటాయని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.ఇప్పుడు వస్తున్నా సమాచారం ప్రకారం ఆ జాబితాను ఓ సారి పరిశీలిద్దాం.

1) మేకపాటి గౌతమ్‌ రెడ్డి
2) అంజాద్‌ బాషా
3) అనిల్‌కుమార్‌ యాదవ్‌
4) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
5) గుమ్మనూరు జయరాం
6) నారాయణస్వామి
7) బొత్స సత్యనారాయణ
8) ధర్మాన కృష్ణదాస్‌
9) కొడాలి నాని
10) పాముల పుష్ప శ్రీవాణి
11) అవంతి శ్రీనివాస్‌
12) కురసాల కన్నబాబు
13) పినిపె విశ్వరూప్‌
14) పిల్లి సుభాష్‌చంద్రబోస్‌
15) వెల్లంపల్లి శ్రీనివాస్‌
16) పేర్ని నాని
17) బాలినేని శ్రీనివాస్‌రెడ్డి
18) ఆళ్ల నాని
19) తానేటి వనిత
20) మేకతోటి సుచరిత
21) మోపిదేవి వెంకటరమణ
22) ఆళ్ల రామకృష్ణారెడ్డి
23) శంకర్‌నారాయణ
24) చెరుకువాడ శ్రీరంగనాథ రాజు
25) బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి