బరువు 30 కిలోలు, ధర 30 లక్షలు.. వామ్మో దీపికా..!

Monday, October 30th, 2017, 08:56:11 PM IST

దీపికా పదుకొనె బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో సైతం క్రేజీ సెలెబ్రిటీగా మారిపోయింది. ఆమె అందం, అభినయం పాపులారిటికి ఓ కారణమైతే.. వరుసగా బాలీవుడ్ హీరోలతో నడిపిన ప్రేమ వ్యవహారాలు కూడా దీపిక క్రేజ్ పెంచేశాయి. సినిమా విషయంలో దీపికా ఎంత కష్టాన్నైనా భరిస్తుందనే ప్రశంసని దక్కించుకుంది. తాజాగా దీపికా నటించిన పద్మావతి చిత్రం విడుదల కావాల్సి ఉంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రంలో దీపికా టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మించారు.

ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకోగా ఇటీవల గుమార్ అనే వీడియో సాంగ్ ని విధుల చేశారు. ఈ పాటలో దీపికా నృత్యం నెటిజన్లని తెగ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లో దీపికా ధరించిన లెహంగా కూడా చూపరులని ఆకర్షించింది. ఈ లెహంగా గురించి ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. బాలీవుడ్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం దీపికా ధరించిన లెహంగా బరువు 30 కేజిలట. ధర సుమారు రూ 30 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంత బరువైన, విలువైన లెహంగా ధరించిన దీపికా సాంగ్ లో మొత్తం 66 సార్లు గుండ్రంగా తిరగడం విశేషం.