కరీనాకు తొందరెక్కువే.. పుట్టక ముందే బిడ్డకు పేరు..!

Tuesday, September 27th, 2016, 05:20:42 PM IST

kareena-kapoor1
సెలెబ్రిటీల పిల్లల విషయం లో మీడియా ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తూనే ఉంటారు. సాధారణంగా జనాలకి కూడా ఇద్దరు సేలేబ్రిటీలు పెళ్లి చేసుకుంటే ఒకింత ఆశ్చర్యంగా తరవాత తరవాత వారి పర్సనల్ జీవితం చాలా ఆసక్తిగా మారుతుంది. కరీనా – సైఫ్ ఆలీఖాన్ ల మధ్య ప్రేమ బంధం ఈనాటిది కాదో ఎన్నో సంవత్సరాల నుంచీ వీరిద్దరి మధ్యనా ఈ బంధం కొనసాగుతూ మొన్ననే పెళ్లి పీటలవరకూ వచ్చింది. రీసెంట్ గా తనకి బిడ్డ పుట్టబోతోంది అని వెల్లడించింది కరీనా కపూర్. ఆ పుట్టబోయే పాప లేదా బాబు కి పేరెం పెడతారు అని అప్పుడే జనాల మధ్యానా , మీడియా లో డిస్కషన్ లు సాగుతున్నాయి. ఈ తరుణం లో స్వయంగా కరీనా తన బిడ్డ గురించి చెప్పుకొచ్చింది. ఈ బిడ్డకు తన భర్త సైఫ్ అలీ ఖాన్ పేరు, తన పేరు కలిసొచ్చేలా సైఫీనా అన్న పేరును పెట్టాలని నిర్ణయించామని, ఈ పేరును సైఫ్ ఎంపిక చేశాడని చెప్పుకొచ్చింది. తొందరలో దుబాయ్ కి వెళ్లి కొన్నాళ్ళు అక్కడ ఉండి విశ్రాంతి తీసుకుని భారత్ చేరుకుంటాం అని ఆమె చెప్పింది. మరొక సెలెబ్రిటీ జంట షాహిద్ కపూర్ , మీరా రాజ్ పుత్ లు తమకి ఆడపిల్ల పుడితే ఇద్దరి పేర్లలో మొదటి అక్షరాలు తీసుకుని మిషా అని పెట్టిన సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments