కూతురుతో కలిసి జిమ్ లో కుస్తీలు పడుతున్న కమల్ హాసన్

Wednesday, March 28th, 2018, 10:02:15 PM IST

సకల కళావల్లభుడు కమల్ హాసన్.. ఇప్పుడు కేవలం నటుడు మాత్రమే కాదు, రాజకీయ నాయకుడు కూడా. ఇటీవల మక్కల్ నీది మయ్యం అనే పేరుతో పార్టీని స్థాపించి, పూర్తి రాజకీయ నాయకుడిగా మారాడు. ప్రతి సమస్యపై తన గళాన్ని వినిపిస్తున్న కమల్ , పలు సామాజిక సేవా కార్యక్రమాలలోను పాల్గొంటున్నాడు. ఇక తన సినిమాల విషయానికి వస్తే త్వరలో విశ్వరూపం 2 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాడు. దీని తర్వాత శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 అనే సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై అభిమానులలో చాలా క్రేజ్ నెలకొంది. ఎందుకంటే ఈ రెండు సినిమాలు ఒకప్పుడు పెద్ద హిట్ కొట్టిన సినిమాలు కాబట్టి. అయితే తాజాగా తన కూతురితో కలిసి జిమ్ లో దిగిన ఫోటోని షేర్ చేశాడు కమల్ హాసన్ . మసిల్ మ్యాన్ సూరి పర్యవేక్షణలో నా బేబితో జిమ్ చేస్తున్నాను. ఇలా చేస్తే మనసుకి ప్రశాంతంగా కూడా ఉంటుందని కమల్ చెప్తూ ఆనందాన్ని వ్యక్తం చేసాడు. అక్షర్ హాసన్ గుడ్ బై గర్ల్ అనే నవల ఆధారంగా వెబ్ సిరీస్ చేస్తుంది. న్యాయం కోసం పోరాడే 18 ఏళ్ళ బాలిక జీవిత నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ రూపొందుతుంది. ఆదిత్య దత్ దర్శకత్వంలో రూపొందుతున్న వెబ్ సిరీస్ కోసమే అక్షర్ కాస్త బాడీ పెంచుతున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే జిమ్ లో కుస్తీలు పడుతుంది. ఇక కూతురి కోసం కమల్ కూడా జిమ్ బాట పట్టారు.