మెగా ఫాన్స్ ను టార్గెట్ చేస్తున్న.. నాని ?

Saturday, February 17th, 2018, 01:59:21 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ లో ఉన్నది ఎవరంటే .. మెగా ఫ్యామిలీ మాత్రమే .. మిగతా హీరోలంతా ఉన్నారు .. కానీ పవర్ ఫుల్ ఇమేజ్ తో హీరోలతో జోరుగా ఉన్నారు మెగా హీరోలు .. ఫాన్స్ !! అందుకే ఈ మధ్య చాలా మంది ఇతర హీరోలు మెగా ఫాన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వరుస విజయాలతో ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకున్న హీరో నాని కూడా మెగా ఫాన్స్ ని టార్గెట్ చేస్తున్నాడు. మరో వైపు నిర్మాతగా కూడా మారిన నాని తీసిన అ సినిమా పలువురి ప్రశంశలు అందుకుంటుంది. ఇక హీరోగా కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్న నాని ఓ ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన చంటబ్బాయి చిత్రాన్ని రీమేక్ చేయాలనీ ఉందని చెప్పడం విశేషం !! జంధ్యాల దర్శకత్వంలో మెగాస్టార్ నటించిన ఆ సినిమా మంచి నవ్వులు పండించి సూపర్ హిట్ గా నిలిచింది.

ఇప్పుడు ఈ చిత్రాన్ని మెగా ఫ్యామిలీ హీరో కాకుండా నాని రీమేక్ చేస్తే ఫాన్స్ ఒప్పుకుంటారా ? అన్నది అసలు సమస్య !! ఎందుకంటే ఇప్పటికే మెగా ఫ్యామిలీలో ఏకంగా ఏడుగురు హీరోలు ఉన్నారు .. ఇప్పటికే మెగా మేనల్లుడు సాయి ధరమ్ చిరంజీవి సాంగ్స్ ని రీమిక్స్ చేస్తూ తన సినిమాల్లో వాడుకుంటున్నాడు. అయన కూడా చిరంజీవి సినిమాను రీమేక్ చేయాలనీ చూస్తున్నాడు. ఇక అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ .. ఇప్పుడు కొత్తగా చిరంజీవి అల్లుడు కళ్యాణ్ .. ఇంతమంది ఉండగా నాని ఎందుకు మెగాస్టారా సినిమాను రీమేక్ చేయాలను అనుకున్నాడో మరి !! ఒక వేళా మెగా ఫాన్స్ అభిమానం సంపాదిస్తే తన ఫాలోయింగ్ కు ఇక తిరుగుండదని అనుకున్నాడో ఏమో !!