కుటుంబంతో కలిసి రంగస్థలం సినిమా చూసిన పవన్

Tuesday, April 10th, 2018, 10:37:54 AM IST

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొద్ది రోజులుగా సినిమాల‌కి దూరంగా ఉంటూ కేవ‌లం రాజ‌కీయాల‌తో బిజీ బిజీగా ఉంటున్నారు. అయితే ఈ బిజీ షెడ్యూల్‌లోను త‌న అన్న‌య్య కుమారుడు రామ్ చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లం చిత్రాన్ని ఫ్యామిలీ స‌భ్యుల‌తో క‌లిసి వీక్షించారు ప‌వ‌న్‌. స్పెష‌ల్ స్క్రీనింగ్‌లో దాదాపు చిత్ర యూనిట్ అంతా హాజ‌రైంది. చిత్రం చూసిన త‌ర్వాత ప‌వ‌న్ మీడియాతో మాట్లాడుతూ.. తొలిప్రేమ తర్వాత నేను బయట షోస్ కి రాలేదు. రంగస్థలం థియేటర్ లో చూడాలనిపించింది. రామ్ చరణ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు. నిర్మాత నవీన్ గొప్ప సినిమా తీశారు. సుకుమార్ గారు వాస్తవానికి దగ్గిరగా అద్భుతంగా తీశారు. నా మనసుకు విపరీతంగా నచ్చింది సినిమా అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న‌స‌క్సెస్ మీట్‌లో సినిమా గురించి మాట్లాడుతాన‌ని ప‌వ‌న్ అన్నారు. రంగ‌స్థ‌లం చిత్రం గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్క‌గా ఇందులో రామ్ చ‌ర‌ణ్‌,స‌మంత‌, జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టి, అన‌సూయ‌, ప్ర‌కాశ్ రాజ్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. చిత్రంలో ప్ర‌తి ఒక్క‌రి పాత్ర ఎంతో నేచుర‌ల్‌గా ఉంది. మ‌హేష్ బాబు, ఎన్టీఆర్, రాజ‌మౌళి, వ‌ర్మ త‌దిత‌రులు టీంపై ప్ర‌శంస‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments