బాహుబలికి ఈ సంవత్సరంలోనే పెళ్లి అంటున్న కృష్ణంరాజు

Saturday, January 21st, 2017, 09:28:20 AM IST

prabhas-krishnam-raj
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే అందరికీ గుర్తోచేపి పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే ప్రభాస్ కి 38 సంవత్సరాలు వచ్చేసాయి. కానీ ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ సిరీస్ పూర్తి అయితేనే కానీ పెళ్లి చేసుకోనని ప్రభాస్ చెప్పాడు. ఇప్పుడు బాహుబలి-2 కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ లో విడుదలకు సిద్ధం అవుతుంది. ప్రభాస్ కూడా తన తరువాతి సినిమా సుజిత్ దర్శకత్వంలో చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మాట్లాడుతూ… ప్రభాస్ పెళ్లి ఈ సంవత్సరంలోనే ఉంటుందని స్పష్టం చేశారు. బాహుబలి-2 విడుదల తరువాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని చెప్పారు. తనకు తెలిసినంతవరకు సుజిత్ సినిమా మొదలుకాకముందే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని కృష్ణంరాజు అన్నారు. అయితే ప్రభాస్ ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో, ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయో మాత్రం కృష్ణంరాజు స్పష్టం చేయలేదు. ఆ అమ్మాయి గోదావరి జిల్లాలకు చెందిన అమ్మాయని, ఆ సంబంధాన్ని ప్రభాస్ తల్లి చూసారని అనుకుంటున్నారు. ప్రభాస్ పెళ్లిపై ఒక క్లారిటీ రావాలంటే బాహుబలి-2 విడుదల అయ్యేవరకు వేచి చూడాలి.