హీరో రాజశేఖర్ కుటుంబంలో విషాదం

Wednesday, September 27th, 2017, 03:20:19 PM IST


టాలీవుడ్ లో తనదైన శైలిలో సినిమాలను తీసి ఫెమస్ అయిన హీరో రాజశేఖర్. అయితే ఆయన తల్లి ఆండాళ్ వరదరాజ్ ఈ రోజు ఉదయం తుదిశ్వాసను విడిచారు. గత కొంత కాలంగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్ని రోజులు నుండి హైదరాబాద్ అపోలో హాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కన్ను మూశారు. 82 సవత్సరాల గల ఆండాళ్ వరదరాజ్ కి ముగ్గురు కొడుకులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో హీరో రాజశేఖర్ రెండవ వ్యక్తి. అయితే ఆమె ఎక్కువగా రాజశేఖర్ దగ్గరే ఉండడానికి ఇష్టపడేవారని తెలుస్తోంది. ఆమె మరణ వార్త వినగానే రాజశేఖర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ రోజు సాయత్రం ఆమె పార్థివ దేహాన్ని చెన్నై కి తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు చేయనున్నారని తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments