షాకింగ్ కాంబినేషన్ లో రామ్ మల్టీస్టారర్..?

Monday, October 1st, 2018, 10:50:20 AM IST

టాలీవుడ్ లో మల్టి స్టారర్ సినిమాల హావ బాగా పెరిగిపోతుంది. ఇప్పటికే ఈ తరహా సినిమాలపై హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న ఎఫ్ 2 సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. దాంతో పాటు ఇటీవలే నాగ్ అండ్ నాని కాంబినేషన్ లో వచ్చిన దేవదాస్ మంచి సక్సెస్ సాధించడంతో ఇప్పుడు మరింత ఊపు పెరింది. లేటెస్ట్ గా హీరో రామ్ ఓ మల్టి స్టారర్ సినిమాకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం అయన త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో హలొ గురు ప్రేమకోసమే సినిమాలో నటిస్తున్న రామ్ తదుపరి సినిమాగా మల్టి స్టారర్ ఉంటుందట. ఈ మద్యే ఆర్ ఎక్స్ 100 సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో మరో హీరోగా మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.