రామ్ కొత్త సినిమా షురూ గురూ..!

Thursday, April 26th, 2018, 03:11:24 PM IST

చాలా రోజురోజులు గ్యాప్ తీస్కోని మెల్లగా హిట్ల వైపు దూసుకుపోతున్న యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ రీసెంట్‌గా ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం నేను లోకల్ ఫేమ్ త్రినాథ్ రావ్ నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో ‘హలో గురు ప్రేమ‌ కోసమే’అనే టైటిల్‌తో చిత్రం మరో చేస్తున్నాడు. ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా అభిమానుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో రామ్ కు జోడీగా మరో సారి అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో అలరించనున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండ‌గానే మ‌రో సినిమాని లాంచ్ చేశాడు హీరో రామ్‌. గ‌రుడ వేగ చిత్రంతో మంచి హిట్ కొట్టిన ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో త‌న 17వ సినిమా చేయడానికి సిద్దం కాబోతున్నాడు.

కాగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల అంచ‌నాలని మించేలా ఉంటుంద‌ని సినీ వర్గంలో గుసగుసలు వెలువడుతున్నాయి. మే 7నుండి జార్జియా దేశంలో రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ మూవీ నెలాఖ‌రు వ‌ర‌కు ఫ‌స్ట్ షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. ఆ త‌ర్వాత స్విట్జ‌ర్లాండ్‌, ఫ్రాన్స్, ఇట‌లీలోని సుంద‌రమైన ప్ర‌దేశాల్లో చిత్రీక‌ర‌ణ జ‌ర‌పుకోనుంది. విదేశాల నుంచి తిరిగి వ‌చ్చాక కాశ్మీర్‌, ల‌డ‌ఖ్‌లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తారట‌. న్యూ వేవ్ లో సాగే ఈ చిత్రంలో యాక్ష‌న్, అడ్వంచ‌ర‌స్ అంశాలు పుష్క‌లంగా ఉంటాయని ద‌ర్శ‌కుడు తెలిపారు. చిత్రంలో కాజ‌ల్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు స‌మ‌చారం. గ‌తంలో రామ్‌, కాజ‌ల్ క‌లిసి గ‌ణేష్( 2009) అనే చిత్రంలో క‌లిసి న‌టించారు. స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మాణంలో ఈ మూవీ రూపొంద‌నుంది.

  •  
  •  
  •  
  •  

Comments