హాలీవుడ్ సినిమా అవెంజర్స్ లో చాన్సు కొట్టిన భళ్ళాలదేవా…

Monday, March 26th, 2018, 03:02:16 PM IST

హాలీవుడ్‌ సినిమాలో మన తెలుగు నటుడు రంగప్రవేశం చేసాడా, అది కూడా బాహుబలి నటుడు రానా అలియాస్ భళ్ళాలదేవానా అని​ ఆశ్చర్యపోయి చూడకండి. రానా దగ్గుబాటి హాలీవుడ్‌లో అడుగుపెట్టింది నటనతో కాదు.. ఆ సినిమాలో ఓ పాత్రకు తన వాయిస్ ద్వారా డబ్బింగ్‌ చెప్పడం వాళ్ళ హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. అవెంజర్స్‌ సిరీస్‌లోనే భారీ అంచనాలు, పెట్టుబడులతో రిలీజ్ కాబోతున్న సినిమా అవెంజర్స్‌ ఇన్ఫినిటీ వార్‌. ఈ సినిమాలో హీరోలను ఢీ కొట్టే సింగిల్‌మన్‌ ఆర్మీ.. అదే విలన్‌ తానోస్‌ పాత్రకు రానా డబ్బింగ్ చెప్పాడట. ఈ సారి తెలుగు నటుడు హాలీవుడ్ సినిమాలో నటించక పోయినా కనీసం ఆ భళ్లాలదేవ విలనిజాన్ని తెర మీద ప్రేక్షకులు వినబోతున్నారు ప్రేక్షకులు. ఈ సందర్బంగా రానా మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి మార్వెల్‌ కామిక్స్ చదువుతూ‌, సినిమాలు చూస్తూ పెరిగానన్నారు.

మార్వెల్‌ సంస్థ ఎవ్వరూ ఊహించని విధంగా మంచి కథలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అద్భుతమైన ఎఫెక్ట్స్ తో కూడిన కథలను ఇస్తూ అలరిస్తోందన్నారు. ఐరన్‌ మాన్‌, కెప్టెన్‌ అమెరికా ఆయనకు నచ్చిన పాత్రలని తెలిపారు. ఈ సినిమాలో ఉన్న విలన్స్ లో తానో పాత్రకు డబ్బింగ్‌ చెప్పటం చాలా సంతోశంహా ఉందన్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో రానా డబ్బింగ్‌ చెప్పినట్లు గానే ఇతర భాషల్లో కూడా అక్కడి నటీనటులతో డబ్బింగ్‌ చెప్పిస్తున్నారు నిర్మాతలు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక మరి మన భళ్ళాలదేవా ఎంతవరకూ న్యాయం చేసాడో చూడాలి.