అన్నదారిలోనే .. ఎంట్రీ ఇచ్చిన తమ్ముడు శంకర్ ?

Tuesday, October 17th, 2017, 12:05:58 AM IST

పాపులర్ సినిమా దర్శకుడిగా టాలీవుడ్ లో ఇమేజ్ తెచ్చుకున్న పూరి జగన్నాధ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా పరిచయం అయి చాలా రోజులు అవుతుంది. పాపం ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఇతగాడికి సరైన విజయం మాత్రం దక్కడం లేదు. అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్న .. విజయాలు దూరంగా వెళుతున్నాయి. దాంతో విసిగి వేసారిన శంకర్ .. నెక్స్ట్ స్టెప్ అన్న దారిలోకి వచ్చేసాడు .. ఈ సారి అయన దర్శకుడిగా మారతాడట !! దానికోసం ఓ మంచి లవ్ స్టోరీ ని రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే ఆ దిశగా సన్నాహాలు మొదలు పెట్టాడట, త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుందని టాక్. అయితే సాయి రామ్ శంకర్ కొత్త వాళ్లతో సినిమా చేస్తాడా ..లేక లీడింగ్ హీరోలతో చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. సో త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ప్రకటన రానుంది. మొత్తానికి అన్న దారిలోకి ఎంట్రీ ఇచ్చిన సాయి రామ్ శంకర్ .. మరి దర్శకుడిగా ఎలా సక్సెస్ అవుతాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments