విలన్ గా మారిన బొమ్మరిల్లు సిద్దార్థ్ ?

Thursday, April 12th, 2018, 11:49:16 AM IST


మొత్తం మీరే చేసారు ..!! మొత్తం మీరే చేసారు .. !! అంటూ తెలుగులో హీరోగా ఓ రేంజ్ ఇమేజ్ దక్కించుకున్న సిద్దార్థ్ కు బొమ్మరిల్లు చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. ఆ ఒక్క సినిమాతో తెలుగులో స్టార్ ఇమేజ్ అందుకున్న సిద్దార్థ్ ఆ తరువాత చాలా చిత్రాలు చేసాడు. ఈ మధ్య వరుస పరాజయాలతో కెరీర్ వెనక్కి తగ్గింది. ప్రస్తుతం అవకాశాలు బాగా తగ్గినా సిద్దార్హ్ .. ఇప్పుడు ప్రతి నాయకుడిగా రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. అటు బాలీవుడ్ లోకూడా మంచి ఇమేజ్ తెచ్చుకున్న సిద్దార్హ్ తాజగా కమ్మర సంభవం అనే మలయాళ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో హీరో దిలీప్ .. హీరోకి సమానంగా సిద్దార్థ్ విలన్ పాత్ర ఉంటుందని టాక్ . కథ నచ్చడంతో పాటు పాత్ర కొత్తగా ఉండడంతోనే సిద్దార్థ్ విలన్ గా ఒప్పుకున్నాడని టాక్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ లో సిద్దార్థ్ కూడా త్వరలోనే పాల్గొంటాడట. మరి విలన్ గా సిద్దు ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments