సిద్ధార్థ్‌.. మ‌రీ అంత దారుణమా?

Saturday, April 14th, 2018, 10:41:01 PM IST

సౌతిండియాలోనే గ్రేట్ పెర్ఫామ‌ర్‌గా వెలిగిపోయాడు హీరో సిద్ధార్థ్‌. మెగా హీరోలు సైతం `నాకు న‌చ్చే హీరో` అని అభిమానం సంపాదించుకున్న ఘ‌నాపాటి. బొమ్మ‌రిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి క్లాసిక్ హిట్స్ అత‌డి కెరీర్‌లో ఉన్నాయి. ఇప్ప‌టికీ అత‌డికి తెలుగు వారిలో వీరాభిమానులు ఉన్నారు. అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో అన్న చందంగా.. అత‌డికి స‌క్సెస్ లేదు. పైపెచ్చు మీడియాతో గొడ‌వ‌లు సిద్ధూని ప‌ట్టి కింద‌కి లాగేశాయి. ఓవైపు తెలుగులో అవ‌కాశాల్లేవ్‌. మ‌రోవైపు హిందీలోనూ ఎందుక‌నో ఛాన్సుల్లేవ్‌. ఇలాంటి స‌న్నివేశంలో అడ‌పాద‌డ‌పా తమిళంలోనే న‌టిస్తూ కాల‌క్షేపం చేస్తున్నాడు. తాజాగా మాలీవుడ్ మార్కెట్‌పైనా సిద్ధూ క‌న్నేశాడ‌ని అతడి యాక్ట్ చెబుతోంది. సిద్ధార్థ్ మాలీవుడ్‌లో తొలి సినిమాలో న‌టించాడు. `కమ్మ‌ర‌సంభ‌వం` అనేది టైటిల్. మ‌ల‌యాళ స్టార్ హీరో దిలీప్ ఈ చిత్రంలో వేరొక హీరో.

ఈ శుక్ర‌వారం ఘ‌నంగా రిలీజైన ఈ సినిమా సిద్ధార్థ్‌కి పెద్ద లైఫ్ ఇస్తుంద‌నుకుంటే, ఇది కూడా అత‌డిని తీవ్రంగానే నిరాశ‌ప‌రిచింద‌ని చెబుతున్నారు. ఈ సినిమాకి రిలీజ్ వేళ మిక్స్‌డ్ రివ్యూలొచ్చాయి. దీంతో అత‌డి ఆశ‌ల‌న్నీ ఆవిరైన‌ట్టేన‌ని చెబుతున్నారు. ఇదివ‌ర‌కూ రిలీజైన ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్నా.. ఎందుక‌నో సినిమా మాత్రం యావ‌రేజ్ అన్న టాక్ తెచ్చుకోవ‌డంతో సిద్ధార్థ్‌కి అక్క‌డా ఆశ‌లు వ‌దులుకోవాల్సిన ప‌రిస్థితి ఉంది. ఇది ఊహించ‌నిది.. ఎవ‌రి లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్ప‌లేమ‌న‌డానికి సిద్ధూ ఓ ఎగ్జాంపుల్‌!