అమిత్ షా ధీమా వెన‌కున్న కార‌ణం?

Sunday, July 7th, 2019, 10:32:00 AM IST

ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు కర్ణాట‌క‌, చెన్నై కేంద్రంగా సాగే రాజ‌కీయాల్ని చిన్నాభిన్నం చేసే కుట్ర జ‌రుగుతోందా?. న‌టుడు శివాజీ ఆరోపించిన‌ట్టుగానే స్కెచ్ న‌డుస్తోందా? ద‌క్షిణాదిపై ఆప‌రేష‌న్ గ‌రుడ ఉక్కుప‌ట్టు బిగిస్తోందా?. అంటే అవున‌నే అర్థ‌మ‌వుతోంది. వ‌రుసగా జ‌రుగుతున్న ప‌రిణామాలు శివాజీ మాట‌ల్ని నిజం చేస్తున్నాయి. గ‌తంలో ఓ వైట్ బోర్డ్ పెట్టుకుని ద‌క్షిణాదిని తమ చెప్పుచేత‌ల్లోకి తీసుకోవ‌డం కోసం ఏం చేస్తున్నారో శివాజీ పూస గుచ్చారు. అమిత్ షా బీజేపీ కీల‌క వ‌ర్గాలు ద‌క్షిణాదిపై ఆప‌రేష‌న్ గ‌రుడ పేరుతో ఆప‌రేష‌న్ మొద‌లుపెట్ట‌బోతున్నార‌ని, దానికి సంబంధించి త‌న ద‌గ్గ‌ర ఖ‌చ్చిత‌మైన స‌మాచారం వుంద‌ని శివాజీ గ‌తంలో చాలా సార్టు మీడియా ముందుకొచ్చి లెక్క‌ల‌తో స‌హా వివ‌రించి అంతా ఆశ్చ‌ర్య‌పోయేలా చేశారు.

అయితే శివాజీ చెప్పిన లెక్క‌ల్ని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు స‌రిక‌దా ఆప‌రేష‌న్ గ‌రుడు లేదు ఏమీ లేద‌ని కొట్టి పారేశారు. అస‌లు అలాంటి ఆప‌రేష‌న్ ద‌క్షిణాదిపై ఎందుకు జ‌రుగుతుంద‌ని, శివాజీకి ఎక్క‌డా ప‌ని లేక ఇలా గ‌రుడ పురాణం అంటూ మీడియా ముందు హ‌డావిడీ చేస్తున్నాడ‌ని అంతా న‌వ్వుకున్నారు. కానీ ఇప్పుడు శివాజీ ఏదైతే చెప్పాడో అక్ష‌రాలా అటు ఇటుగా అదే జ‌రుగుతోంది. కర్ణాట‌క‌లో ఇప్ప‌టికే రాజ‌కీయ సంక్షోభాన్ని సృష్టించిన బీజేపీ అక్క‌డి కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌తో కొత్త గేమ్ మొద‌లుపెట్టింది. వాళ్ల‌ల్లో వాళ్ల‌కే గొడ‌వ‌లు పెట్టించి ఫైన‌ల్‌గా యాడ్యూర‌ప్ప‌ను సీఎంపి చేయాల‌ని ప‌థ‌కం వేసింది. ఇక చెన్నైలో అధికార ప‌క్షాన్ని బుట్ట‌లో వేసుకునేంత ప‌ని చేసింది. అయితే ఇంకా లొంగిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌లే ఏపీలో కీల‌క నేత‌ల్ని చేర్చుకుని ఇప్ప‌టికే అక్క‌డ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టిన బీజేపీ క‌న్ను తెలంగాణ‌పై ప‌డింది.

కేసీఆర్ అల‌స‌త్వం కార‌ణంగా ఆ పార్టీకి నాలుగు ఎంపీ స్థానాలు ద‌క్క‌డంతో మరింత ప‌ట్టు ల‌భించిన‌ట్ట‌యింది. దీంతో ఏకంగా అమిత్ షా రంగంలోకి దిగారు. ఎక్క‌డ బీజేపీకి ప‌ట్టుందో అక్క‌డి నుంచే స‌భ్య‌త్వ న‌మోదు ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు అధికార తెరాస వెన్నులో వ‌ణుకు పుట్టించే విధంగా వున్నాయి. ద‌క్షిణాదిలో భ‌విష్య‌త్తులో బీజేపీ జెండా ఎగుర‌వేయ‌డం ఖాయం. 2024లో తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చేది బీజేపీనే. అంటూ చేసిన వ్యాఖ్య‌లు ముఖ్యంగా తెరాస‌కు మింగుడు ప‌డ‌టం లేదు. అమిత్ షా ధీమా వెన‌కున్న కార‌ణం ఏంటి? తెలంగాణ‌లో అధికారంలోకి బీజేపీ ఎలా వ‌స్తుంద‌ని చెబుతున్నారు. హ‌రీష్ లాగేస్తే త‌మ ప‌ని సులువు అవుతుంద‌న్న న‌మ్మ‌క‌మా?. అదే జ‌రిగితే ఉద్య‌మ పార్టీ తుడిచిపెట్టుకు పోవాల్సిందేనా? అని తెరాస నేత‌ల్లో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది.