శ‌తాధిక చిత్రాల హీరో కంబ్యాక్ మూవీ

Sunday, May 20th, 2018, 03:33:11 PM IST

శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీకాంత్ అంటే ఫ్యామిలీ ఆడియెన్ చెవి కోసుకునేవారు. కానీ ఇటీవ‌లి కాలంలో శ్రీ‌కాంత్ కెరీర్ కాస్తంత‌ డోలాయ‌మానంలో ప‌డింది. త‌న‌వైపు వ‌చ్చిన ప్ర‌తి సినిమాని అంగీక‌రించ‌డం ఓ కార‌ణ‌మైతే, స‌రైన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, విష‌యం ఉన్న బ్యాన‌ర్లు అత‌డిని ఎప్రోచ్ కాక‌పోవ‌డం ఈ వైఫ‌ల్యానికి కార‌ణంగా విశ్లేషిస్తున్నారు. ఇక అత‌డి వార‌సుడు రోష‌న్ అత‌డి లెగ‌సీని ముందుకు తీసుకెళ్లాల్సిందేన‌ని శ్రీ‌కాంత్ తెలంగాణ‌, ఆంధ్రా అభిమానులు ఫిక్స‌య్యారు. ఆ క్ర‌మంలోనే ఇటీవ‌ల రోష‌న్ హీరోగా తెర‌కు ప‌రిచ‌యం అయ్యాడు. నిర్మ‌లా కాన్వెంట్ అనే సినిమాతో రోష‌న్ ఆక‌ట్టుకున్నాడు. సినిమా జ‌యాప‌జ‌యాల‌తో ప‌ని లేకుండా శ్రీ‌కాంత్ కొడుకు ఛ‌రిష్మాని అంతా మెచ్చుకున్నారు.

ఇక‌పోతే ఈలోగానే శ్రీ‌కాంత్ ఊహించ‌ని ట్విస్టునిస్తూ త‌న కంబ్యాక్‌ని చాటుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. అత‌డు మ‌రో సినిమాతో రీఎంట్రీ ఇవ్వ‌డం ప్ర‌స్తుతం ఫిలింన‌గ‌ర్‌లో హాట్ టాపిక్ అయ్యింది. శ్రీ‌కాంత్ హీరోగా `పెళ్ళంటే` అనే చిత్రం నేడు ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా శ్రీ‌కాంత్ మాట్లాడుతూ -“చాలా కాలం త‌ర్వాత కుటుంబ క‌థా చిత్రంలో న‌టిస్తున్నా. నాకు ప‌క్కాగా యాప్ట్ అయిన స‌బ్జెక్ట్ ఇది. అలీ క‌థ బాగుంది చేయి? అని డైరెక్ట‌ర్ ను నా ద‌గ్గ‌ర‌కు పంపిచాడు. క‌థ విన‌గానే వెంట‌నే ఒకే చేసా. మంచి ఎట‌ర్ టైన‌ర్. న‌వ‌ర‌సాలు క‌థ‌లో ఉన్నాయి. మోయిన్ చాలా సినిమాల‌కు రైట‌ర్ గా ప‌నిచేసారు. ఆ అనుభ‌వంతో క‌థ‌ను బాగా రాసుకున్నాడు.

సినిమా కూడా బాగా తీస్తార‌ని న‌మ్మ‌కం ఉంది“ అని అన్నారు శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`…? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ లో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి హీరో త‌రుణ్ క్లాప్ నివ్వ‌గా, రాజేంద్ర కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. `మా` అధ్య‌క్షుడు శివాజీ రాజా గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఏంజెల్ ప్రొడ‌క్ష‌న్స్, మ‌ద‌ర్ అండ్ ఫాద‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ల‌పై అలీ భాయ్ నిర్మిస్తున్నారు. మోయిన్ మ‌హ‌మ్మ‌ద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌లో అలీ మాట్లాడుతూ, “ప‌లు సినిమాల‌కు రైట‌ర్ గా ప‌నిచేసిన రాజేంద్ర కుమార్ `క్షేమంగా వెళ్లి లాభంగా రండి` సినిమాకు రైట‌ర్. ప్ర‌తిభావంతంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌గ‌ల‌డు.. అని తెలిపారు. తాజా చిత్రంతో శ్రీ‌కాంత్ తిరిగి ఫ్యామిలీ ఆడియెన్‌ని ఆక‌ట్టుకోగ‌లిగితే మారిన ట్రెండ్‌లో అత‌డు మ‌రిన్ని సినిమాల్లో న‌టించేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంది.

  •  
  •  
  •  
  •  

Comments