వావ్ .. సూర్య నిజంగానే రియల్ హీరో ?

Tuesday, July 24th, 2018, 09:23:06 PM IST

మన హీరోల్లో చాలా మంది రీల్ హీరోలే కాదు రియల్ హీరోలుగా అప్పుడప్పుడు మారుతూ ఉంటారన్నా విషయం మన అందరికి తెలిసిందే. హీరోలుగా తమ క్రేజ్ ని ఈ రేంజ్ పెంచిన ప్రేక్షకులకోసం .. లేదా అభిమానులకోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య రైతుల కోసం ఏకంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించడం విశేషం. ఇప్పటికే సూర్య అగరం ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా అయన నిర్మాతగా కార్తీ హీరోగా చినబాబు చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా తమిళంలో మంచి విజయం అందుకోవడంతో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సూర్య పాల్గొని తమిళనాడు రైతులకోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నాని, దాన్ని అగరం ఫౌండేషన్ ద్వారా రైతులకు పలు సేవాకార్యక్రమాల ద్వారా అందజేస్తారని చెప్పారు. ఇప్పటికే ఈ ఫౌండేషన్ ద్వారా ఎందరో విద్యార్థులకు స్కాలర్స్ షిప్స్ ఇస్తూ ఎంతో మందిని చదివిస్తున్నారు. సూర్య ప్రకటనతో పలువురు హర్షం వ్యక్తం చేసారు. సో ఈ సందర్బంగా సూర్య దొడ్డ మనసుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments