హీరో విజయ్ కి గాయాలు .. సోషల్ మీడియాలో వైరల్ ?

Sunday, September 16th, 2018, 08:34:09 PM IST


హీరోలంటే జనాలకు ఓ రేంజ్ అభిమానం .. ఆ అభిమానం ఒక స్థాయివరకు ఉంటె ఓకే కానీ .. హద్దులు దాటితే ఎలా ఉంటుందో తాజా సంఘటన సంచలనం రేపింది. తమిళ స్టార్ హీరో విజయ్ కి గాయాలయాయ్యి. హీరో విజయ్ ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. దీంతో అయన చుట్టూ అభిమానులు చేరాడడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో విజయ్ కాలికి గాయం అయింది . ఈ సంఘటన పాండిచ్చేరి లో జరిగింది. హీరో విజయ్ అభిమాన సంగం అధ్యక్షుడు మాజీ ఎం ఎల్ ఏ ఆనంద్ కూతురు వివాహానికి హీరో విజయ్ హాజరయ్యాడు. విజయ్ తో పాటు అయన సతీమణి కూడా పాల్గొన్నారు. హీరో విజయ్ ఈ పెళ్ళికి వస్తున్నాడని తెలుసుకుని అభిమానులు భారీగా తరలిరావడం .. విజయ్ తో సెల్ఫీలు దిగే ఉద్దేశంతో జనాలు తోసుకురావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. విజయ్ చుట్టూ ఉన్న బౌన్సర్లు ఉన్నా కూడా ఫాన్స్ ను అదుపు చేయలేకపోయారు. దాంతో జనాలు మీదికి రావడంతో స్టేజి ఒక్కసారిగా కుప్ప కూలింది .. దాంతో హీరో విజయ్ కాలికి గాయం అయ్యిందట. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విజయ్ ని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతుంది. అభిమానం మరి ఇంత దారుణంగా ఉండకూడని కామెంట్స్ పడుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments