హీరో విశాల్ కు అంత టెంపర్ ఉందంటారా ?

Wednesday, March 21st, 2018, 10:33:23 PM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కరప్టెడ్ పోలీస్ గా ఎన్టీఆర్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాను ఇప్పటికే హిందీలో రీమేక్ చేస్తున్నారు. తాజాగా తమిళంలో రీమేక్ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. హీరో విశాల్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇక హీరోయిన్ గా ఇప్పటికే పలువురు పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా గ్లామర్ భామ రాశి ఖన్నా కు ఓకే చేశారట. తొలిప్రేమ విజయంతో రాశి ఖాన్న కు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే తమిళంలో నాలుగు సినిమాల్లో నటిస్తుంది ఈ భామ. మురుగ దాస్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన వెంకట్ మోహన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.