ఎన్నికలకు సిద్ధమవుతోన్న కోలీవుడ్ హీరో

Friday, December 1st, 2017, 06:05:26 PM IST

తనదైన శైలిలో సినిమాలను చేసి కోలీవుడ్ – టాలీవుడ్ సినీ ప్రేక్షకులను మెప్పిస్తొన్న హీరో విశాల్ సామాజిక సేవలో ఈ మధ్య తెగ పాల్గొంటున్నాడు. ముఖ్యంగా రైతుల విషయంలో విశాల్ తనదైన శైలిలో స్పందిస్తున్నాడు. కొన్ని నెలలక్రితం చెన్నై రైతులు ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు విశాల్ అక్కడికి వెళ్లి వారికి అండగా నిలిచారు. అంతే కాకుండా ఢిల్లీలో కేంద్ర ప్రబుత్వ అధికారులతో చర్చలు జరిపి వారి సమస్యను తీర్చాడు.

రాజకీయాలపై కూడా అప్పుడపుడు స్పందిస్తున్నాడు. అయితే ఇంతకుముందు పలు ఇంటర్వ్యూలలో రాజకీయాలకు వస్తాను అని చెప్పిన విశాల్ త్వరలోనే తమిళ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్కే నగర్ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఈ హీరో ఉన్నట్లు అక్కడి మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆ తర్వాత ఒక పార్టీని కూడా స్థాపించనున్నాడట. ప్రస్తుతం విశాల్ కోలీవుడ్ సంఘం అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం సెక్రటరీగా వ్యవహరిస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments