పుకార్లను నమ్మకండి .. నేను బాగానే ఉన్నానంటున్న విశాల్ ?

Tuesday, February 27th, 2018, 12:20:41 PM IST

తమిళ , తెలుగు భాషల్లో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో విశాల్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మరో వైపు అయన కోలీవుడ్ నడిగర్ సంగం పనులలో కూడా అంతే బిజీగా ఉన్నారు .. అయితే గత కొన్ని రోజులుగా విశాల్ విమరీతమైన తలనోప్పితో బాధపడుతున్నారని .. ఆ నొప్పి భరించ లేక హాస్పిటల్ లో చేరాడని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఆ తరువాత ట్రీటీమెంట్ కోసం విశాల్ .. అమెరికా కూడా వెళ్లాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇంకా సీరియస్ కావడంతో విశాల్ స్పందించాడు.. తనకున్న మైగ్రేన్ సమస్యకు జాగ్రత్తలు తీసుకుంటున్నానని, త్వరలోనే పూర్తిగా నయం అవుతుందని డాక్టర్స్ చెప్పారని అయన అన్నాడు. తాను అమెరికాలో హాస్పిటల్ లో ఉన్నట్టు వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ప్రస్తుతం నేను బాగానే ఉన్నానని ఇలాంటి పుకార్లను నమ్మొద్దని తెలిపాడు. మార్చ్ మొదటి వారం నుండి తాను షూటింగ్ లో పాల్గొంటున్నానని తెలిపాడు.