ఇక్కడ ఆరబోస్తేనే అవకాశాలంటున్న హీరోయిన్?

Tuesday, March 20th, 2018, 10:33:23 AM IST

సినిమాల్లో అవకాశాలు రావాలంటే నాకు టాలెంట్ ఉంది .. నేను గొప్పగా నటిస్తా అంటూ కథలు చెబితే ఎవ్వరు అవాకాశాలు ఇవ్వరు .. తప్పకుండా అందాలు ఆరబోయ్యల్సిందే అని ఖరా ఖండిగా చెప్పింది గ్లామర్ భామ ఆండ్రియా. ఇప్పటికే సంచలన హీరోయిన్ గా ముద్ర వేసుకున్న ఈ అమ్మడు ఎన్ని సినిమాలు చేసినాగాని పాపం కెరీర్ పరంగా సరైన కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు. దాంతో సెకండ్ హీరోయిన్ గానే సెటిల్ అయింది. ఈ మద్యే సిద్దార్థ్ తో గృహం అంటూ ఓ హర్రర్ సినిమాలో మెరిసిన ఈ భామకు టాలెంట్ పుష్కలంగా ఉన్నా కూడా అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు. ఏ అవకాశం వచ్చినా గ్లామర్ తప్పనిసరి అంటున్నారట. ఈ అమ్మడితో మరో టాలెంట్ కూడా ఉంది .. అదేమిటో తెలుసా .. తాను మంచి సింగర్ కూడా. చాలా పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఇక్కడ అవకాశాలు రావాలంటే అందాలు ఆరబోయ్యల్సిందేనని, కెరీర్ మొదట్లో నయనతార, దీపికా లు కూడా అందాలు ఆరబోసే ఈ స్థాయికి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేసింది ఆండ్రియా. మొత్తానికి మరోసారి సంచలన తారగా వార్తల్లో నిలిచింది.