ఆమె నాకు చెల్లెలే కాదంటున్న … అంజలి ?

Monday, September 25th, 2017, 01:19:56 PM IST


లేటెస్ట్ గా ఆరాధ్య అనే అమ్మాయి .. హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు మీడియా ముందు ప్రకటించింది. తాను హీరోయిన్ అంజలి చెల్లిని అని చెప్పుకున్న ఈ అమ్మాయి .. కొన్ని పోలికలు దగ్గరగా ఉండడంతో అందరు నిజమనే అనుకున్నారు ? అయితే ఈ విషయం తెలియడంతో హీరోయిన్ అంజలి రియాక్ట్ అయింది ? అసలు నాకు చెల్లె లేదు .. ఉన్నది ఒకతె అక్క .. ఆమెకూడా సుబ్బరంగా కాపురం చేసుకుంటుందని చెప్పడంతో అందరు షాక్ అయ్యారు ? అసలు చెల్లె లేదని అంజలి ఎందుకు చెప్పింది ? నిజంగానే ఆమెకు చెల్లి లేదా లేక కుటుంబలో ఉన్న తగాదాల నేపథ్యంలో అలా చెప్పిందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది ? సినిమా రంగంలో హీరోయిన్స్ చెల్లెల్లు పరిశ్రమలోకి వస్తే వారికి మంచి ప్రోత్సహమే ఉంటుంది .. ఈ కోవలో ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ గా వెలిగారు కూడా .. అదే కోవలో అంజలి చెల్లిగా పరిచయం చేసుకున్న ఆరాధ్య కూడా మంచి అవకాశాలు వస్తాయని భావించి .. ఇలా చెప్పిందా లేక .. నిజంగానే ఆమె చెల్లెలా అన్నది తెలియాల్సి ఉంది. మరి ఈ విషయం పై క్లారిటీ రావాలంటే ఆరాధ్య రెస్పొంద్ అవ్వాలి మరి.

  •  
  •  
  •  
  •  

Comments