తమిళ అమ్మాయికి పాప పుట్టిందోచ్ ?

Wednesday, October 25th, 2017, 10:33:25 AM IST

అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ ఆసిన్ గుర్తుందిగా .. ఆ తరువాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు అటుపై బాలీవుడ్ లోకూడా హీరోయిన్ గా ఓ రేంజ్ ఇమేజ్ దక్కించుకుంది. గజినీ హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఆసిన్, గత కొంత కాలంగా మైక్రోమాక్స్ సి ఈ ఓ రాహుల్ తో ఘాటు ప్రేమాయణం సాగించిన ఈ భామ గత ఏడాది పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సినిమాలు మానేసి కాపురం చేసుకుంటున్న ఆసిన్ నిన్న సాయంత్రం ఓ కూతురికి జన్మనిచ్చినట్టు తెలిసింది. పెళ్లి తరువాత ఎక్కడ కనిపించని ఆసిన్ ఇలా సడన్ గా కూతురు పుట్టిందన్న న్యూస్ వినడంతో అందరు షాక్ అవుతున్నారు.