ఆ నిర్మాత బ్రోకర్ అంటూ హీరోయిన్ కామెంట్ ?

Monday, January 30th, 2017, 11:19:53 AM IST

meera
”ఆ నిర్మాత ఈ పనులు చేయలేదని ఎలా మాట్లాడుతున్నాడో చుడండి ..” అంటూ ట్విట్టర్ లో ఘాటు కామెంట్ పెట్టింది మీరా చోప్రా .. ఇంతకి మీరా చోప్రా ఎవరో గుర్తుందిగా … అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ”బంగారం” సినిమాలో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా కు ఆ తరువాత తెలుగులో ”వాన”, చిత్రంలో కూడా చేసిన ఈ అమ్మడు నిర్మాతను బ్రోకర్ అంటూ కామెంట్ చేయడం సంచలనం రేపింది. ఇంతకి ఆ నిర్మాత ఎవరో తెలుసా .. ఇటీవలే పలు కామెంట్స్ తో ఘాటు సంచలనం రేపిన బండ్ల గణేష్ గురించి .. ? బండ్ల గణేష్ గురుంచి ఈ హీరోయిన్ ఇలా ఎందుకు రియాక్ట్ అయిందనే విషయం ఇప్పుడు ఆసక్తి గా మారింది. మీరా పెట్టిన కామెంట్ కు స్పందించిన సచిన్ జోషి త్వరలోనే బండ్ల గణేష్ చేసిన మోసాలను, చెత్త పనులను బయట పెడతానని అలాంటి మోసగాడి మాటలను ఎవరు నమ్మొద్దని ట్విట్ చేసాడు .. అయితే ఇది చేసిన కొద్దీ సేపటికే మీరా తన ట్విట్ ని డిలీట్ చేయడం విశేషం. మరి ఈ ట్విట్ విషయంలో ఎవరిని నమ్మాలో తెలియకుండా ఉంది ?