కాజల్ పెద్దమ్మ అయ్యిందోచ్!

Thursday, February 22nd, 2018, 09:15:10 PM IST

ఏమైంది ఈ వేళ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ చెల్లి నిషా అగర్వాల్ అందరికి గుర్తుండే ఉంటుంది. అయితే 2013లో ముంబై బిజినెస్ మ్యాన్ ని నిషా పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. పెళ్లి తరువాత పూర్తిగా సినిమాలకు ఎండ్ చెప్పేసి అమ్మడు మంచి ఇల్లాలిగా జీవనాన్ని కొనసాగిస్తోంది. అయితే పెళ్లి అయినప్పటి నుండి ఎక్కడా కనిపించని నిషా చాలా రోజుల తర్వాత ఒక మంచి న్యూస్ తో అందరిని పలరించింది. నిషా రీసెంట్ గా ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కాజల్ స్వయంగా చెప్పింది. ప్రస్తుతం ఈ వార్త కాజల్ కుటుంబంలో చాలా సంతోషాన్ని నింపింది. మొత్తానికి కాజల్ పెద్దమ్మ అయ్యిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినబడుతున్నాయి.