ఒకప్పుడు హీరోయిన్.. కానీ ఇప్పుడు ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటోంది

Tuesday, April 26th, 2016, 07:06:31 PM IST


సినిమా రంగం.. ఎవరి జీవితాలనైనా ఓవర్ నైట్ లో మార్చేయగల సత్తా ఉన్న రంగం. అందుకే దీన్ని రంగుల లోకం అంటారు. సక్సెస్ వస్తే అన్ని రంగులూ కనిపిస్తాయి. ఒకవేళ సక్సెస్ రాలేదో ఒక్క చీకటి నలుపు తప్ప మరేమీ కనిపించదు. ఈ రంగుల లోకంలో నలిగిపోయిన వారెందరో. అలాంటి వారిలో హీరోయిన్ మిథాలి శర్మ ఒకటి.

సినిమాలపై మోజుతో తల్లిదండ్రులు కాదన్నా ఆ రంగుల లోకంలోకి అడుగుపెట్టిన ఆమె అనుకున్నట్టే హీరోయిన్ అయింది. ఓ బోజ్ పురి సినిమాలో హీరోయిన్ గా చేసింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఆమెకు తరువాత ఆవకాశాలు రాలేదు. దీంతో ఆమె బ్రతుకు చీకటైంది. ఇంట్లో వాళ్ళకు మొహం చూపించలేక తనలో తానే భాదపడి చివరికి మతిస్థిమితం కోల్పోయి తిండి కోసం ముంబై నగర వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ బ్రతుకుతోంది. మతిస్థిమితం లేక ఓ కారు అద్దాలు పగలగోడుతూ పోలీసులకు పట్టుబడ్డ ఈమె కన్నీటి కథ ఆసుపత్రిలో వెలుగు చూసింది.