ప్రధాని పై కౌంటర్ వేస్తున్న హీరోయిన్?

Saturday, May 26th, 2018, 06:13:03 PM IST

ఈ మధ్య చాలా మంది ప్రధాని మోడీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని చేస్తున్న కార్యక్రమాల పట్ల పలువురు అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఇక కర్ణాటకలో అయితే మరి దారుణంగా ఉంది పరిస్థితి. ఏ చిన్న అవకాశం వచ్చిన మోడీపై విసుర్లు విసురుతున్నారు. ఇక ఏ చిన్న అవకాశం దొరికినా కూడా బిజెపి ప్రభుత్వం పై విరుచుకు పడే కర్ణాటక మాజీ ఎంపీ, హీరోయిన్ రమ్య మరోసారి మోడీ పై ఘాటు వాక్యాలు చేసింది. తాజాగా మొబైల్ అప్స్ లో పే టి ఎం అంటూ ప్రచారం తెగ చేసారని, పే టిఎం అంటూ పే టూ మోడీ అంటూ కామెంట్ చేసింది. ఈ మొబైల్ యాప్ ద్వారా మీ డేట్ మొత్తాన్ని బీజీపీ వాళ్లకు ఇచ్చేస్తున్నామని పేర్కొంది. ఐతే ఈ విషయాన్నీ టాగ్ చేస్తూ మోడీకి రమ్య ట్విట్టర్ లో మెసేజ్ పెట్టింది. దాంతో పలువురు నెటిజన్స్ .. మండిపడుతున్నారు. ఓ వ్యక్తి ( రాహుల్ గాంధీ ) కోసం నౌకరి, చాకిరీ చేస్తున్న మీ వైఖరి మార్చుకొండని ఓ నెటిజన్ సలహా కూడా ఇచ్చాడు. మరి ఈ విషయం పై ఈ అమ్మడు ఎలా స్పందిస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments