తన ప్రేమ వ్యవహారం గురించి సంగీత ఏమందో తెలుసా ?

Saturday, June 2nd, 2018, 01:18:35 AM IST

ఖడ్గం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగీత గుర్తుందా .. ఒక్క ఛాన్స్ అంటూ అందరిని ఆకట్టుకున్న ఈ గ్లామర్ భామ పెళ్ళాం ఊరెళితే .. , ఈ అబ్బాయి చాలా మంచోడు, సంక్రాంతి లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ఈ భామ ప్రేమ పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో సంగీత మాట్లాడుతూ .. తన ప్రేమాయణం గురించి చెప్పి షాకిచ్చింది. సినిమాల్లోకి రాకముందే హీరో విజయ్ ఫామిలీ తో మంచి అనుబంధం ఉండేదని, నిజానికి సంగీత హీరో విజయ్ సినిమాతోనే ఎంట్రీ ఇవ్వాల్సింది కానీ అనుకోకుండా మరో సినిమాతో ఎంట్రీఇచ్చింది . అయితే హీరో విజయ్ కు తన ప్రేమ గురించి ముందే చెప్పేసిందట. హీరో విజయ్ మాత్రం ప్రేమ గీమా వద్దు .. ఎందుకు కెరీర్ పాడు చేసుకుంటావని చెప్పారని .. కానీ తన ప్రేమలో సిన్సియారిటీ నచ్చి ప్రోత్సహించారని చెప్పారు. అన్నట్టు సంగీత ప్రేమించిన వ్యక్తి పేరు కూడా విజయ్ కావడం విశేషం.

  •  
  •  
  •  
  •  

Comments