పిల్లలను కనడానికి తల్లులకు లైసెన్స్ ఉండాలి అంటున్న ప్రముఖ హీరోయిన్

Saturday, December 31st, 2016, 09:33:14 AM IST

sanjana
తెలుగులో బుజ్జిగాడు, కిక్ లాంటి హిట్ సినిమాలలో నటించిన సంజన ఇక్కడ అంత సక్సెస్ కాలేకపోయింది. అందుకే వేరే భాష చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఆమె ఎప్పుడూ తన మనసులో ఉన్న భావాల్ని చెప్పడానికి వెనుకాడదు. ఎవరేమనుకున్నా తాను చెప్పాల్సింది చెప్తుంది. ఇప్పుడు కూడా ఆమె పిల్లల్ని కనడానికి తల్లులకు లైసెన్స్ ఉండాలని అప్పుడే పిల్లల్ని కనాలని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. మోటార్ వాహనాలను నడపడానికి, వస్తువుల ఉత్పత్తులకు, వాటిని విక్రయించడానికి లైసెన్స్ ఉన్నట్లే పిల్లల్ని కనడానికి కూడా లైసెన్స్ ఉండాలి అంటుంది.

చాలామంది తల్లులు పిల్లల్ని కానీ వాళ్ళను అడుక్కోవడానికి పంపుతున్నారు, లేదా తామే ఆ పిల్లల్ని చంకనేసుకుని అడుక్కుంటున్నారు. మరికొందరేమో పిల్లల్ని అడుక్కోవడానికి వేరొకరికి అద్దెకు ఇస్తున్నారు. కొందరేమో కేవలం సంపాదన కోసమే పిల్లల్ని కంటున్నారు. అలంటి తల్లులకు లక్ష రూపాయలు ఇచ్చి అడుక్కోవద్దు అని చెప్పినా వారు మాత్రం మారరు. రోడ్ పక్కన ఎండల్లో, వానల్లో వాళ్ళు పడుతున్న అవస్థలు చూస్తుంటే దుఃఖం పొంగుకొస్తుందని సంజన అన్నారు. వారికి తినడానికి అన్నం, కట్టుకోవడానికి బట్టలు కూడా ఉండవు. అందుకే ఒక తల్లి పిల్లల్ని కనాలనుకుంటే ఆ తల్లులకు పిల్లల్ని కని, పెంచే ఆర్ధిక స్తొమత ఉండ లేదా అని చూసి వాళ్లకు లైసెన్స్ ఇవ్వాలని లైసెన్స్ తీసుకున్న తరువాతే పిల్లల్ని కనాలని సంజన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు కూడా ఈ విషయం ఆయనకు చెప్పానని ఆమె అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments