లేటు వయసులో ఈ ఘాటు పోజులెందమ్మో ?

Sunday, April 1st, 2018, 02:07:35 PM IST

ఈ మధ్య అందాల భామలకు గ్లామర్ ను ఆయుధంగా చేసుకుని రసిక హృదయాలను కొల్లగొట్టడం మనం చూస్తున్నదే. ఇప్పటికే పలువురు భామలు బికినీలు , టాప్ లెస్ అంటూ నానా రచ్చ చేస్తున్నారు. ఈ లిస్ట్ లోకి అవుట్ డేటెడ్ హీరోయిన్స్ కూడా రంగంలోకి దిగి తమ అందాలనే నమ్ముకున్నారు. ఈ ఉపద్గతం అంతా ఎందుకంటే .. అప్పట్లో హీరోయిన్ గా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న కాజోల్ చెల్లి .. తానిషా ముఖర్జీ హీరోయిన్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగులో ఎన్టీఆరే సరసన కంత్రి సినిమాలో నటించింది. ఆ సినిమా ఈ అమ్మడికి పెద్దగా క్రేజ్ తేలేదు .. దాంతో మళ్ళీ బాలీవుడ్ లోనే ఉండిపోయింది. ఆ తరువాత పెద్దగా సినిమాలు చేయదని ఈ అమ్మడు ఈ మధ్య జిమ్ లో కసరత్తులు చేస్తూ తన వయసు ఇంకా తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా హాట్ హాట్ గా ఫోటో షూట్ చేస్తూ ఓ రేంజ్ లో ఘాటు పెంచుతుంది. మరి ఇప్పుడైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments