అందాల నాయిక‌ల బిజినెస్ చూశారా?

Friday, June 8th, 2018, 02:17:24 AM IST

సామాజిక మాధ్య‌మాలు బిజినెస్‌కి కేంద్రంగా మారాయి. ప్ర‌పంచం మొత్తాన్ని ఇక్క‌డ గుప్పిట ప‌ట్ట‌వ‌చ్చు. ఆ క్ర‌మంలోనే ట్విట్ట‌ర్‌, ఎఫ్‌బి, ఇన్‌స్టాగ్ర‌మ్ అకౌంట్లు మ‌న క‌థానాయిక‌లకు భారీ వ్యాపార మార్గాల్ని సుగ‌మం చేస్తున్నాయి. ఓ ర‌కంగా చెప్పాలంటే నెటిజ‌నులు ఎక్కువ‌గా అనుస‌రిస్తున్నది సామాజిక మాధ్య‌మాల‌నే కాబ‌ట్టి అక్క‌డ క‌థానాయిక‌ల ఆర్జ‌న అంత‌కంత‌కు పెరుగుతోంది. ట్విట్ట‌ర్, ఇన్‌స్టాగ్ర‌మ్ ఖాతాలు తెరిచి భారీగా ఫాలోవ‌ర్స్‌ని తెచ్చుకుంటే చాలు.. కార్పొరెట్ కంపెనీలు వెంట‌ప‌డి మ‌రీ అవ‌కాశాలిస్తున్నాయి. త‌మ ఉత్ప‌త్తుల్ని ప్ర‌చారం చేయించుకుంటున్నాయి. అందుకు భారీగానే పారితోషికాలు ముడుతున్నాయి.

ఇటీవ‌లే ఒక్క క‌న్నుగీటుతో ప్ర‌పంచాన్ని దాసోహం చేసుకున్న ప్రియా వారియ‌ర్‌కి ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ప‌లు బ్రాండ్ల‌కు ప్ర‌చారం చేసే అవ‌కాశం ద‌క్కించుకుంది. చిన్నా చిత‌కా బ్రాండ్ల‌కు ప్ర‌మోష‌న్ చేస్తూ ఈ భామ చేతినిండా సంపాదిస్తోంది. ఇదే వేదిక‌పై చిన్న స్టార్లే కాదు.. అనుష్క శ‌ర్మ‌, సోన‌మ్ క‌పూర్‌, రియా క‌పూర్‌, ప్రియాంక చోప్రా, కంగ‌న వంటి నాయిక‌లు భారీగా కార్పొరెట్ ఉత్ప‌త్తుల‌కు ప్ర‌చారం చేసుకుంటూ ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇందులో అమితాబ్‌, అమీర్‌, హృతిక్ వంటి స్టార్లు ఉన్నారు. సామాజిక మాధ్య‌మాల్లో అసాధార‌ణ క్రేజును బ‌ట్టి అందే పారితోషికం ఉంటుంది. ఇక స‌న్నీలియోన్ లాంటి క‌థానాయిక సొంతంగా స్టార్‌స్ట‌క్ కంపెనీ ప్రారంభించి, త‌న ఉత్ప‌త్తుల‌కు తానే సామాజిక మాధ్య‌మాల ద్వారా ప్ర‌మోష‌న్ చేసుకుంటోంది. ఇలా ప‌రిశీలిస్తే సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో ఈ త‌ర‌హా ఆదాయం ఆర్జించే వాళ్లు ఎంద‌రో. తాజాగా ప‌రిణీతి చోప్రా ఓ ఐస్‌క్రీమ్ బ్రాండ్‌కే ప్ర‌చారం చేయ‌డం కంట‌ప‌డింది.

  •  
  •  
  •  
  •  

Comments