నటి బాత్ టబ్ నగ్న వీడియో లీక్….మద్యం మత్తులో జరిగిందని వివరణ!

Friday, June 15th, 2018, 02:41:18 PM IST

ఇటీవల సోషల్ మీడియా ప్రభావం ఎక్కువయ్యాక అవసరం వున్నా లేకున్నా అందరూ తమకు సంబందించిన ప్రతిఒక్క విషయాన్నీ అప్ లోడ్ చేయడం, తమవారితో పంచుకోవడం వంటివి చేస్తున్నారు. నిజానికి ఇలా మంచి విషయాలు పంచుకోవడం తప్పులేదుగాని, అదే ఒక్కోసారి ఏదైనా పొరపాటున పోస్ట్ చేస్తే ఇంక అంతే సంగతులు. దానివల్ల జరిగే పరిమాలు ఒక్కోసారి తీవ్రంగా కూడా ఉండవచ్చు మరి. అలానే నేడు బాలీవుడ్ బుల్లి తెర నటి సారాఖాన్ సోదరి, సారా బాత్ టబ్ లో స్నానం చేస్తుండగా తీసిన వీడియోని తన సోషల్ మీడియా మాధ్యమం ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో పెద్ద వివాదమే చెలరేగింది. ఆ వీడియోని వీక్షించిన పలువురు నెటిజన్లు సిగ్గులేదా, బుద్ధి లేదా అంటూ సారా పై విరుచుకు పడ్డారు. అయితే ఆకామెంట్లకు ఖంగుతిన్న ఆమె సోదరి వెంటువంటి ఆ వీడియో ని డిలీట్ చేసారు. అయితే అప్పటికే ఆ వీడియో తాలూకు క్లిప్స్ కొన్ని బయటకు వచ్చేసాయి.

దీనితో జరిగిన పొరపాటు పై వివరణ ఇచ్చేందుకు సారా నేడు ఒక మీడియా ఛానల్ ముందుకు వచ్చి అది తన సోదరి మద్యం మత్తులో తెలియక చేసిన పోస్ట్ అని, ఏదో సరదాగా అలా చేయబోతే, విషయం వికటించిందని, ఈ విషయమై అందరూ తనను క్షమించాలని, ఇకపై ఇటువంటి పొరపాటు తననుండి జరగకుండా చూసుకుంటానని అన్నారు. ప్రస్తుతం ప్రపంచం వేగవంతంగా అభివృద్ధి చెందుతూ దూసుకుపోతోందని, ఈ డిజిటల్ యుగంలో సెలెబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగినా అది ఎప్పటికి తొలగించలేని పెద్ద పరిణామంగా తయారయ్యే అవకాశం వుందని చెప్పారు. కాగా సారా ఖాన్ పలు హిందీ సీరియల్స్ తో పాటు బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా పాల్గొన్నారు…..