కాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్ అనిత సెన్సేషనల్ కామెంట్స్ ?

Thursday, April 26th, 2018, 10:49:56 PM IST

ప్రస్తుతం సినిమా పరిశ్రమను ఓ రేంజ్ లో ఊపేస్తున్న అంశం కాస్టింగ్ కౌచ్. హీరోయిన్స్ పై లైంగిక వేధింపుల విషయం పై ఈ మధ్య చాలా మంది హీరోయిన్స్ బాహాటంగా బయటికి చెప్పడంతో పెద్ద రాద్దాంతమే జరుగుతుంది. ఇక శ్రీ రెడ్డి వ్యవహారంతో ఇంకాస్త ఫైర్ ఎక్కువైనా ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం అటు బాలీవుడ్ లోకూడా పెద్ద దుమారమే రేగుతుంది. తాజగా ఓ హీరోయిన్ కూడా ఈ విషయం పై స్పందించింది. ఆమె చెప్పిన విషయాలు సంచలనం రేపుతున్నాయి. ఇంతకీ ఎవరా ? హీరోయిన్ ఏమా కథ అంటే .. తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనిత. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన అనిత ఆ తరువాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ రెండు మూడు సినిమాల్లో నటించింది. దాంతో పాటు హిందీ సీరియల్స్ లో కూడా నటించిన ఈ అమ్మడు కాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూ .. తనకు కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయాని, తాను హీరోయిన్ గా నటించే సమయంలో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు పరిస్థితి కొద్దిగా మారిందని తెలిపింది. తనకు మంచి నిర్మాతలు దొరకడం వెళ్లే తాను మంచి పొజిషన్ లో ఉన్నానని పేర్కొంది. కాస్టింగ్ కౌచ్ నుండి తప్పించుకోవాలంటే అమ్మాయిలు చాకచక్యాన్ని చూపాలని తెలిపింది.

  •  
  •  
  •  
  •  

Comments