నర్తనశాలలో హీరోయిన్ మారింది ?

Saturday, April 14th, 2018, 11:37:47 AM IST

చలో సినిమాతో మంచి విజయం అందుకున్న నాగ శౌర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం నర్తనశాల. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రిన్ పీర్జాద ని హీరోయిన్ గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హీరోయిన్ మారినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మెహ్రిన్ స్థానంలో హలొ భామ ప్రియదర్శిని ఎంపిక చేసారు. హలో సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియదర్శి మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ కొట్టేసింది. షూటింగ్ మొదలైన తరువాత హీరోయిన్ ఎందుకు మారిందన్న విషయం ఆసక్తికరంగా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments