రాజశేఖర్ కు… హీరోయిన్ కావలెను ?

Friday, August 10th, 2018, 05:04:22 PM IST

గరుడావెగ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన యాంగ్రీ యాంగ్ మెన్ రాజశేఖర్ హీరోగా మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నాని నిర్మాతగా చేసిన అ ! సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయం పెద్ద తలనొప్పిగా మారిందట. ఇప్పటికే కాజల్, శ్రియ ల పేర్లు వినిపించినా వాళ్ళు ఓకే చెప్పలేదు. ఇప్పుడు రాజా శేఖర్ సరసన హీరోయిన్ ఎవరనే విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దర్శక నిర్మాతలు హీరోయిన్ అన్వేషణలో ఉన్నారట.

  •  
  •  
  •  
  •  

Comments