హిందీ అర్జున్ రెడ్డికి నో చెప్పిన హీరోయిన్ ?

Friday, September 7th, 2018, 11:01:05 PM IST

టాలీవుడ్ లో సంచలనం రేపిన చిత్రం అర్జున్ రెడ్డి. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ను రాత్రికి రాత్రే సూపర్ స్టార్ ని చేసింది. ఈ సినిమా సంచలన విజయం అందుకోవడంతో ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తాజాగా హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనుంది. త్వరలోనే షూటింగ్ మొదలెడదామని అనుకునే లోగా ఈ సినిమాలో హీరోయిన్ తప్పుకోవడం ఆసక్తి రేపుతోంది.

ఇందులో హీరోయిన్ గా తార సుతారియా ని ఎంపిక చేసారు. అయితే ఆమె తాజాగా స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2 సినిమాలో నటిస్తుంది. అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడంతోనే ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ బి టౌన్ లో మాత్రం మరోలా టాక్ వినిపిస్తుంది .. ఈ సినిమాలో ఎక్కువ లిప్ లాక్ సీన్స్ ఉండడంతోనే ఈ అమ్మడు తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజ నిజాలు ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments