స్టార్ హీరో సినిమాలో వరలక్ష్మి నెగిటివ్ రోల్ ?

Monday, April 16th, 2018, 10:23:43 AM IST

తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్ ప్రారంభం నుండి భిన్నమైన పాత్రల్లో రాణిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. గ్లామర్ హీరోయెన్ గా కూడా మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం నెగిటివ్ రోల్ లో నటించేందుకు రెడీ అయింది ? అదికూడా స్టార్ హీరో సినిమాలో కావడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే ..

స్టార్ హీరో విజయ్ హీరోగా క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి పాత్ర పూర్తిగా నెగిటివ్ పాత్రలో ఉంటుందని, రాజకీయ నాయకురాలిగా కనిపించే ఆమె హీరోతో పోటీగా ఉండే పాత్ర అని తెలిసింది. ఈ పాత్ర కోసం పలువురు పేర్లను పరిశీలించి ఫైనల్ గా వరలక్ష్మి కి అవకాశం ఇచ్చారట. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరాకు విడుదల చేస్తారట.

  •  
  •  
  •  
  •  

Comments