హేయ్‌.. అల్లుడు శీనూకి 4 వ‌య‌సు

Wednesday, July 25th, 2018, 07:28:00 PM IST

అప్పుడే నాలుగేళ్ల‌యిపోయిందా? అల్లుడు శీను రిలీజై! ఇది ఎంతో స‌ర్‌ప్రైజింగ్ క‌దూ? ఇదే ప్ర‌శ్న వివివినాయ‌క్ అల్లుడు శీను ప్రెస్‌మీట్లోనే అభిమానుల్ని అడిగేశారు. నాలుగేళ్లలో త‌న శిష్యుడిలో ఎంతో ప‌రిణ‌తి క‌నిపిస్తోంద‌ని పొగిడేశారు. పెద్ద స్టార్ అయ్యే ఛాన్సుంద‌ని, అవ్వాల‌ని ఆకాంక్షించారు. బెల్లంకొండ శ్రీ‌నుని వినాయ‌క్ మ‌న‌సారా ఆశీర్వ‌దించారు. శ్రీ‌ను ఇంకా 4 సినిమాల కిడ్ అయినా యాక్ష‌న్ స్టార్‌గా ఎదిగేసేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు చేయ‌ని ప్ర‌య‌త్న‌మే లేదు. ఇప్పుడు విన‌య్ ఆశీస్సులు అందించారు కాబ‌ట్టి సాక్ష్యoతో అనుకున్న‌ది సాధిస్తాడేమో చూడాలి. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌- పూజా హెగ్డే జంట‌గా శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వ ంలో అభిషేక్ నామ నిర్మించిన సాక్ష్య ం ఈనెల 27న రిలీజ‌వుతోంది. సెన్సార్ పూర్త‌యి, యుఎ సర్టిఫికెట్ ఇచ్చిన బృందం ప్ర‌శంసించింది. రిలీజ్ వేళ ప్ర‌మోష‌న్స్‌లో ఓ పాట‌ను లాంచ్ చేసిన వినాయ‌క్ పైవిధంగా స్ప ందించారు. మీడియా స‌మావేశంలో సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ – అల్లుడుశీను రిలీజ్ అయి నాలుగేళ్ళు అయిందంటే నమ్మలేక‌పోతున్నా. నిన్ననే షూటింగ్ చేసినట్లుంది. సినిమా సినిమాకి సాయిలో ప‌రిణ‌తి క‌నిపిస్తోందని ప్ర‌శంసించారు. విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయ‌ని, సినిమా రిచ్‌గా, గ్రాండ్ గా తీశార‌ని .. అన్నారు. శ్రీ‌ను పెద్ద స‌క్సెస‌వ్వాల‌ని, వాసూకి హిట్ రావాల‌ని ఆకాంక్షించారు.

  •  
  •  
  •  
  •  

Comments