బాంద్రాలో హై అలెర్ట్‌! స‌ల్మాన్‌కి భారీ భ‌ద్ర‌త!?

Saturday, January 13th, 2018, 11:57:02 AM IST

బాలీవుడ్‌లో సినిమా వాళ్ల‌కు మాఫియా బెదిరింపులు అనేవి చాలా స‌ర్వ‌సాధార‌ణం. టాప్ సెల‌బ్రిటీల‌కు మాఫియా నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు బెదిరింపులు వ‌స్తూనే ఉంటాయి. స‌ల్మాన్, అమితాబ్‌, సంజ‌య్ ద‌త్ వంటి వారికి ఇవి త‌ప్ప‌లేదు. కానీ ఈసారి మ్యాట‌ర్ చాలా సీరియ‌స్ అనే అర్థ‌మ‌వుతోంది. ముఖ్యంగా స‌ల్మాన్ భాయ్ పూర్తిగా చిక్కుల్లో ప‌డుతున్నాడ‌నే అర్థ‌మ‌వుతోంది. ప‌ది హ‌త్య‌లు.. పది పైగా కిడ్నాప్‌లు, చైన్ స్నాచింగ్‌లు చేసిన డేంజ‌ర‌స్ క్రిమిన‌ల్ కం గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ జోధ్‌పూర్ కోర్టు సాక్షిగా.. కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే స‌ల్మాన్ ఖాన్‌ని విలేక‌రుల ముందే బెదిరించాడు. ఇదే జోద్ పూర్‌లో స‌ల్మాన్‌ని చంపేస్తాను.. అంటూ సెన్సేష‌న‌ల్ కామెంట్ చేశాడు. అది ఓ సీరియ‌స్ వార్నింగ్ కూడా. ప‌దేళ్ల క్రితం కృష్ణ జింక‌ను చంపిన కేసులో స‌ల్మాన్ తోపాటు స‌ద‌రు గ్యాంగ్‌స్ట‌ర్‌ని ఇరికించారు. దాంతో ఆ త‌ర్వాత అత‌డు కోర్టుల చుట్టూ తిర‌గాల్సొచ్చింది. ఈ కార‌ణం వ‌ల్ల స‌ల్మాన్‌ని అత‌డు టార్గెట్ చేశాడ‌న్న స‌న్నివేశం అర్థ‌మ‌వుతోంది. ఇదేదో ఏదో బెదిరించాడులే అనే స‌న్నివేశం కాదు. స‌ద‌రు గ్యాంగ్ స్ట‌ర్ అన్నంత ప‌ని చేయ‌బోతున్నాడ‌నే సంకేతాలు అందుతున్నాయి.

మొన్న‌టికి మొన్న ముంబైలోని ఓ స్టూడియోలో రేస్ 3 షూటింగ్ జ‌రుగుతున్న వేళ అక్క‌డ ఓ దుండ‌గుడు క‌నిపించ‌డంతో క‌ల‌క‌లం రేగింది. దాంతో హుఠాహుటీన పోలీసుల బృందం సెట్‌లోకి వ‌చ్చి స‌ల్మాన్‌ని కార్‌లో తీసుకెళ్లిపోయారు. బాంద్రాలోని అత‌డి ఇంట్లో సేఫ్‌గా దించారు. అంటే సెట్‌లో క‌ల‌క‌లానికి స‌ద‌రు గ్యాంగ్ స్ట‌ర్ పంపిన మ‌నిషి రావ‌డం వ‌ల్ల‌నేనా? అన్న సందేహాలు అలుముకున్నాయి. అయితే ఆ ఉదంతంపై పెద్దంత‌గా వివ‌రాలేవీ బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త‌పడ్డారు. ఆ క్ర‌మంలోనే మ‌రోసారి ముంబై పోలీసుల్లో ఒణుకు మొద‌లైంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. ప్ర‌స్తుతం స‌ల్మాన్‌, అత‌డి కుటుంబ స‌భ్యుల‌కు భారీగా భ‌ద్ర‌త పెంచారు. ఏ క్ష‌ణం ఏ ఎటాక్ జ‌రిగినా అది ముంబై పోలీసులకు, రాజ‌కీయ నాయ‌కుల‌కు చెడ్డ‌పేరు కావ‌డంతో వీళ్లంతా నానా హైరానా ప‌డిపోతున్నారు. మ‌రోవైపు రేస్ 3 నిర్మాత నిర్మాత ర‌మేష్ తురాణీ సైతం రేస్ 3 సెట్స్‌లో భారీ భ‌ద్ర‌త పెంపున‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే హై అలెర్ట్ అనే అనిపిస్తోంది.