దేశ‌మంతా హై ఎల‌ర్ట్‌.. భారీ విస్పోట‌నాల‌కు కుట్ర‌!!

Wednesday, January 25th, 2017, 11:36:46 AM IST

terrorist1
జ‌న‌వ‌రి 26వ తేదీ .. హైటెన్ష‌న్ రేకెత్తిస్తోంది. రిప‌బ్లిక్‌డే సంద‌ర్భంగా దేశ స‌మ‌గ్ర‌త‌కు తూట్లు పొడిచే దుర్మార్గ‌పు క్రీడ‌కు తీవ్ర‌వాదులు కుట్ర చేశార‌ని ఇంటెలిజెన్స్ బ్యూరో ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌న‌మైంది. ఆరోజు దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లంతా ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ప‌బ్లిక్ ప్లేసుల్లో హైఎల‌ర్ట్‌ని ప్ర‌క‌టించారు. విమానాశ్ర‌యాల్లో ప్ర‌స్తుతం హై ఎలెర్ట్ కొన‌సాగుతోంది. ప‌బ్లిక్ ఎక్కువ‌గా ఉండే ప్ర‌తిచోటా జాగ్ర‌త్త అన్న హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌నున్నారు పోలీస్‌. ఇప్ప‌టికే దిల్లీలో కొంద‌రు ముష్క‌రులు ప్ర‌వేశించార‌న్న స‌మాచారం ఐబీ నుంచి అందింది.

దిల్లీ, హైద‌రాబాద్‌, జ‌మ్మూ క‌శ్మీర్‌, బెంగ‌ళూరు, హ‌ర్యానా, పంజాబ్ వంటి చోట్ల ఇప్ప‌టికే హై ఎల‌ర్ట్ ప్ర‌క‌టించారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ ప్ర‌ధాన న‌గ‌రాల్లో హైఎలెర్టును ప్ర‌క‌టించేందుకు లోకల్ పోలీస్ రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్ శంషాబాద్ విమానాశ్ర‌యంలో హై ఎలెర్ట్ ప్ర‌క‌టించారు. చెకింగులు క‌ఠిన‌త‌రం చేశారు. ఉగ్ర‌నాయ‌కుడు జ‌కీర్, స‌య్య‌ద్‌ల‌పై సిట్ ద‌ర్యాప్తు సంద‌ర్భంగా మ‌రింత అలెర్టును ప్ర‌క‌టించారు. దిల్లీ లాంటి చోట పేలుళ్ల‌కు సంబంధించిన మందుగుండును పోలీస్ చేజిక్కించుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఏదేమైనా గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ఉగ్ర‌మూక‌లు తెగ‌బ‌డే ఛాన్సుంది. మ‌రో గోకుల్‌చాట్‌, లుంబినీ పార్క్ దారుణాలు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌డం ప్ర‌జ‌ల వంతు. ఉగ్ర‌వాదులు ఉనికిని చాటుకునేందుకు తెగ‌బ‌డుతున్నారు. త‌స్మాత్ .. జాగ్ర‌త్త‌!!