గచ్చిబౌలి ప్లైఓవర్ యాక్సిడెంట్.. హైకోర్ట్ కీలక ఆదేశాలు..!

Wednesday, December 11th, 2019, 12:32:51 AM IST

ఇటీవల హైదరాబాద్‌లో గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై నుంచి కారు పడి ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో కారు నడిపిన వ్యక్తి కృష్ణమిలన్ రావు స్వల్ఫ గాయాలతో భయటపడ్డారు. అయితే ఈ కేసులో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కృష్ణమిలన్ రావును అరెస్ట్ చేయాలని పోలీసులు రంగం సిద్దం చేశారు.

అయితే ఈ అరెస్ట్‌పై ముందుగానే కృష్ణమిలన్ రావు హైకోర్ట్‌ను ఆశ్రయించారు. ప్రమాదానికి అసలు కారణం ఫ్లైఓవర్ డిజైన్ సరిగ్గా లేకపోవడమే అని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు ఫ్లైఓవర్ డిజైన్ లోపం కారణంగానే ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు ఫ్లైఓవర్ పై యాక్సిడెంట్లు అయ్యాయని పిటీషన్‌లో రాసారు. అయితే పోలీసులు మాత్రం ఫ్లైఓవర్ పై 40-50 స్పీడ్ వెళ్ళాలని ఉన్నా కృష్ణమిలన్ 110 స్పీడ్‌తో కారు డ్రైవ్ చేశారని అతడిని అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని రాయదుర్గం పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. అయితే ఈ నెల 12 వరకు కృష్ణమిలన్ రావును అరెస్ట్ చేయొద్దని హైకోర్ట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజు పోలీసుల పిటీషన్‌పై హైకోర్ట్ విచారణ జరుపుతున్నట్టు సమాచారం.