మీడియాని అనుమతించండి.. తెలంగాణ సర్కార్‌కు హైకోర్ట్ కీలక ఆదేశాలు..!

Friday, July 24th, 2020, 11:57:00 PM IST


తెలంగాణ పాత సచివాలయ భవనం కూల్చివేతల్లో మీడియాను అనుమతించకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే మీడియాను ఎందుకు అనుమతించడం లేదన్న పిటీషన్‌పై హైకోర్ట్ నిన్న విచారణ చేపట్టగా సెక్షన్ 180ఈ ప్రకారం సైట్‌లో పని చేసేవారు మాత్రమే ఉండాలని కోర్టుకు తెలిపారు.

అంతేకాదు కూల్చివేత కవరేజీకి మీడియాను అనుమతిస్తే వారికి ప్రమాదం జరగవచ్చని, అందుకే దీనిపై బులెటిన్ విడుదల చేస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఆయితే నేడు మరోసారి విచారణ చేపట్టిన హైకోర్ట్ సచివాలయం కూల్చివేతను పక్కనున్న ప్రైవేట్ భవనాల నుంచి మీడియా చిత్రీకరిస్తే అడ్డుకోవద్దని హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. బులెటిన్ వల్ల ఉపయోగం లేదని, మీడియాను అనుమతించాలని పిటీషనర్ తరపు న్యాయవాది చెప్పారు.