బాబు భద్రత విషయంలో హై కోర్టు కీలక తీర్పు..97 మందితో బాబుకి భద్రత

Wednesday, August 14th, 2019, 05:54:53 PM IST

జగన్ సీఎం అయిన తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి గణనీయంగా భద్రతని తగ్గించాడు. దీనిపై బాబుతో సహా తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున గళమెత్తిన కానీ జగన్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. నిబంధనల ప్రకారమే భద్రత ఉంది. అందులో ఎలాంటి మార్పు లేదని, అలాగే పెంచే అవకాశం కూడా లేదని
స్వయంగా ఏపీ హోమ్ మంత్రి తెలిపారు.

దీనిపై చంద్రబాబు నాయుడు హైకోర్టు లో పిటిషన్ దాఖలాలు చేశారు. తాజాగా దానిపైనా తీర్పుని వెల్లడించిన హైకోర్టు చంద్రబాబు నాయుడుకి 97 మందితో భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని క్లోజ్‌డ్‌ సెక్యూరిటీ ఎవరి పని అనే అంశంపై ఎన్‌ఎస్‌జీ, స్టేట్‌ సెక్యూరిటీ మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలపై మూడు నెలల్లో ఓ నిర్ణయానికి రావాలని అలాగే చంద్రబాబు కాన్వాయ్‌లో జామర్ వాహన సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సృష్టమైన ఆదేశాలు జారీచేసింది.

బాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో 2003 లో అలిపిరిలో బాబుపై నక్సలైట్స్ దాడులు చేశారు. అందులో తృటిలో చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుండి కేంద్రం బాబుకి సెక్యూరిటీ పెంచి, జెడ్ క్యాటగిరి కల్పించింది. అప్పటి నుండి చంద్రబాబుకి అదే సెక్యూరిటీ కల్పిస్తూ వస్తుంది. ఇక హైకోర్టు పై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వానికి ఇది చెంపదెబ్బ అంటూ చెపుతున్నారు.