బిగ్ న్యూస్: ఏపీ లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్

Tuesday, April 6th, 2021, 04:49:05 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరగాల్సిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకి బ్రేక్ వేసింది హైకోర్ట్. అయితే ఎన్నికల నిర్వహణ లో మునిగి పోయిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే ఇంకా తెలియాల్సి ఉంది. హైకోర్ట్ పరిషత్ ఎన్నికల పై స్టే విధించింది. అయితే నాలుగు వారాల ముందు నుండి ఎన్నికల కోడ్ అమలు కావాలి అంటూ సుప్రీం ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేశారు పిటిషనర్లు. అయితే ఈ విషయాన్ని హైకోర్ట్ దృష్టికి తీసుకెల్లారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ టీడీపీ, బీజేపీ, జన సేన లు కోర్ట్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలిపి వేస్తూ హైకోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.