పరిషత్ ఎన్నికల పై కొనసాగుతున్న ఉత్కంఠ… తీర్పును ఎల్లుండి వెల్లడించనున్న హైకోర్ట్!

Sunday, April 4th, 2021, 11:00:02 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ విషయం లో ప్రతి పక్ష పార్టీ లు అయిన బీజేపీ, టీడీపీ, జన సేన లు హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని విడుదల చేసిన నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ ప్రతి పక్ష పార్టీ లు ఉన్నత న్యాయస్థానం ను ఆశ్రయించాయి. అయితే ఎన్నికల ప్రక్రియ విషయం లో బీజేపీ, టీడీపీ, జన సేనలు వేసిన పిటిషన్ల పై వాదనలు ముగిశాయి. వాదనలు ముగిసిన అనంతరం హైకోర్ట్ తీర్పును రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన తీర్పు ను ఎల్లుండి వెల్లడించనుంది. అయితే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ విషయం లో ప్రతి పక్ష పార్టీ లు ఎన్నికల కమిషనర్ నిర్ణయం ను తప్పు బడుతున్నాయి. అంతేకాక ఇప్పటికే ఇలా కొనసాగే అవకాశం ఉంటే టీడీపీ మరియు జన సేన లు ఎన్నికలను బహిష్కరించే అవకాశం ఉంది. మరి దీని పై హైకోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.