అజ్ఞాతవాసికి ప్రీమియర్లతో అది సాధ్యమేనా..!

Tuesday, January 2nd, 2018, 07:58:22 PM IST

టాలీవుడ్ చిత్రాలకు యుఎస్ మార్కెట్ కూడా చాలా కీలకం. ఎన్నారై లకు చేరువయ్యే కంటెంట్ సినిమాలో ఉంటె డాలర్ల వర్షం కురవడం ఖాయం. లోకల్ గా యావరేజ్ అనిపించుకున్న కొన్ని చిత్రాలు యుఎస్ మార్కెట్ ని దున్నేసిన సందర్భాలు ఉన్నాయి. సాధారణంగా త్రివిక్రమ్ చిత్రాలకు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. త్రివిక్రమ్ కు పవర్ స్టార్ స్టార్డం తోడైంది కాబట్టి అక్కడ భారీ వసూళ్లు ఖాయం అని అంచనా వేస్తున్నారు.

ఏకంగా ప్రీమియర్లతోనే అజ్ఞాతవాసి చిత్రం రెండు మిలియన్ల డాలర్లకి కొల్లగొడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాహుబలికి ధీటుగా అజ్ఞాతవాసి చిత్రం యుఎస్ లో రిలీజ్ అవుతోంది. ఆమాటకు వస్తే ఏ భారతీయ చిత్రం విడుదల కానన్ని లొకేషన్ లలో అజ్ఞాతవాసిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి 580 లొకేషన్లు కేటాయించినట్లు తెలుస్తోంది. అజ్ఞాతవాసి ప్రభంజనం ఏస్థాయిలో ఉంటుందో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.