ఇకపై ఏపి ఆలయాలకు పటిష్ట భద్రత

Sunday, September 14th, 2014, 11:14:02 AM IST


ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆలయాలు అన్నింటికీ పటిష్టమైన భద్రతా కల్పించేందుకు ఏర్పాట్లుచేస్తున్నట్టు హొమ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తెలియజేశారు. ఈరోజు ఉదయం ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామీని దర్శించుకున్నారు. దేవస్థానం అభివృద్ది, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. త్వరలోనే ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమిస్తామని ఆయన తెలిపారు. దేవాలయాలకు పటిష్టమైన భద్రతకల్పిస్తామని ఆయన స్పష్టంచేశారు. పోలీసు శాఖలో ఉన్న ఖాళీలను పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు హొమ్ శాఖ మంత్రి చినరాజప్ప తెలియజేశారు.